Sunday, January 12, 2025

జానీ మాస్టర్ కు బిగ్ షాక్…డ్యాన్సర్స్ అసోసియేషన్ నుంచి తొలగింపు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి బెయిల్ మీద బయటకు వచ్చిన టాలీవుడ్ కొరియోగ్రాపర్ జానీ మాస్టర్ కు పెద్ద షాక్ తగిలింది. ఆయనను డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారు. తన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రానంత వరకు డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు. ఆదివారం అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించగా.. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాశ్ గెలిచారు. ఆయన అధ్యక్షుడిగాఎన్నిక కావడం ఇది ఐదోసారి. కొత్త పాలక వర్గం ఎన్నుకున్నాక జానీని ఈ అసోసియేషన్ నుంచి తప్పించారని సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News