Saturday, January 18, 2025

ట్రంప్‌కు భారీ షాక్

- Advertisement -
- Advertisement -

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌నకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోర్న్ స్టార్‌కు హష్‌మనీ వ్యవహారంలో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసేందుకు న్యూయార్క్ కోర్టు తిరస్కరించింది. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షులకు రక్షణ ఉంటుందని మన్‌హట్టన్ న్యాయమూర్తి జువాన్ మర్చన్ స్పష్టం చేశారు. ఇలాంటి అధికారిక ప్రవర్తన విషయంలో ట్రంప్‌నకు రక్షణ వర్తించదని వ్యాఖ్యానించారు. హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలగా, ఈ ఏడాది నవంబరులో న్యూయార్క్ కోర్టు శిక్ష ఖరారు చేయాల్సింది. ఇదే సమయంలో అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు.

దీంతో ఆయన క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్‌కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం కేసుకు సంబంధించిన శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది. తాజాగా ట్రంప్‌నకు ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చింది. దీంతో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ కేసులో ఆయనకు ఊరట లభించకపోతే, శిక్షఅభియోగాలను ఎదుర్కొంటూ శ్వేతసౌథం లోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచే అవకాశం ఉంది.

హష్‌మనీ కేసు పూర్వాపరాలు…
శృంగార తార స్టార్మీడానియల్స్‌తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు ఉన్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరువిప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు 1.30 లక్షల డాలర్ల హష్‌మనీని ఇప్పించారనేది ఆరోపణ. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్నిఖర్చు చేశారని , అందుకోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ప్రధాన అభియోగం. ఇలా మొత్తం 34అంశాల్లో ఆయనపై నేరారోపణలు నమోదయ్యాయి. ఆరు వారాల విచారణ అనంతరం ట్రంప్‌పై మోపిన అభియోగాలన్నీనిజమేనని 12 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఆ మధ్య తీర్పువెలువరించింది. ట్రంప్‌తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ డానియల్స్ స్వయంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆమెతో సహా మొత్తం 22 మంది సాక్షులను కోర్టు విచారించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News