Sunday, January 19, 2025

500 మంది డ్యాన్సర్లతో భారీ పాట

- Advertisement -
- Advertisement -

Big song with 500 dancers

 

తన ప్రతి సినిమాకి విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ‘దసరా’ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న నాని తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతోంది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరుగుతోంది. చిత్రీకరణలో భాగంగా నాని, కీర్తి సురేష్‌లపై భారీ స్థాయిలో ఈ పాటని షూట్ చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ‘నాటు నాటు’ పాటతో సంచలన స్టెప్స్ సృష్టించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకు కోరియోగ్రఫీ అందిస్తున్నారు. దాదాపు 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటని గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులని అలరించడమే లక్ష్యంగా మండు వేసవిని సైతం లెక్క చేయకుండా ఈ పాట కోసం చిత్ర యూనిట్ కష్టపడి పనిచేస్త్తోంది. ఇటివలే విడుదలైన ‘దసరా’ గ్లింప్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. నాని ఫుల్ లెంత్ మాస్, యాక్షన్- ప్యాక్డ్ పాత్రలతో కనిపిస్తున్న ఈ చిత్రం గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనుల దగ్గర ఉన్న ఒక గ్రామం నేపథ్యంలో జరుగుతుంది. ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News