Saturday, June 29, 2024

టి20 వరల్డ్ కప్…. ఇంటిముఖం పట్టిన పెద్ద జట్లు

- Advertisement -
- Advertisement -

టి20 ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్ వంటి పెద్ద జట్లు సెమీస్‌కు చేరకుండానే ఇంటిదారి పట్టాయి. మరోవైపు సౌతాఫ్రికా, భారత్, ఇంగ్లండ్‌లతో పాటు ఏమాత్రం అంచనాలు లేని అఫ్గానిస్థాన్ టీమ్ సెమీస్‌కు చేరి పెను సంచలనం సృష్టించింది. సెమీస్ బెర్త్‌ను దక్కించుకునే క్రమంలో అఫ్గాన్ పెద్ద జట్లు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లను ఓడించింది. మరోవైపు సొంత గడ్డపై ప్రపంచకప్ జరుగుతుండడంతో వెస్టిండీస్ టైటిల్ రేసులో ఉంటుందని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ విండీస్ సూపర్8 దశలోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్ అయితే లీగ్ దశ దాటి ముందుకు వెళ్లలేక పోయింది. శ్రీలంక కూడా పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News