Sunday, December 22, 2024

రాష్ట్రంలోకి పెద్దపులి..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : మహారాష్ట్రలోని తిపేశ్వర్ టైగర్ రిజర్వ్ (టిటిఆర్) నుంచి పెద్ద పులి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. కుడి కన్ను కింద 4 ఆకారంలో పెద్ద గీత కలిగి.. ఫోర్ మార్క్‌గా పేరుగాంచిన పెద్ద పులి.. తన మూడు పిల్లలతో సహా గుంజాల సమీపంలోని మైదాన ప్రాంతంలో సంచరిస్తోంది. భీంపూర్ మండలంలోని గొల్లఘాట్ గ్రామాలు పులి సంచరించినట్లు గుర్తించారు.

టిటిఆర్ నుంచి పెద్ద పులి తన పిల్లలతో ఆహారం, నీటి కోసం తెలంగాణ వైపు మళ్లాయి. శుక్రవారం రాత్రి భీమ్‌పూర్ మండలం పిప్పల్ కోట్ గ్రామ అడవుల్లో పెద్ద పులి, పిల్లలతో రోడ్డు దాటుతుండగా లారీ డ్రైవర్ గమనించాడు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అటవీశాఖ సిబ్బంది పులి కుటుంబాన్ని రక్షించేందుకు రాత్రివేళ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. రెండు ప్రత్యేక బృందాలు పులుల సంచారాన్ని పర్యవేక్షించగా, సిసి కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News