Wednesday, January 22, 2025

తడోబా టైగర్ రిజర్వ్‌ అందాలపై ఎంపీ సంతోష్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

అడవికి రాజులా, అత్యంత రాజసంతో బతికే పులి రూటే సపరేటు. అడవిలో మిగతా జీవులను తన కనుసైగతో శాసించే పెద్ద పులి, తనకు ఆకలేసినప్పుడే వేటాడుతుంది, తనివితీరా తింటుంది. కాసేపు సేదతీరేందుకు కొలనులో జలకాలాడుతుంది. తాజాగా తడోబా టైగర్ రిజర్వ్ లో పెద్దపులి రాజసాన్ని ఎం.పీ. జోగినపల్లి సంతోష్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Tiger in Tadoba Tiger Reserveతన మిత్రుడు కెమెరాలో బంధించిన తడోబాలో పులి ఆహారం, సేదతీరుతున్న దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయని షేర్ చేశారు. ఆహారంగా తనకు ఇష్టమైన అడవిదున్నను వేటాడి ఇష్టంగా తినటంతో పాటు, నీళ్లలో జలకాలాడుతున్న పులి వీడియోలు, ఫోటోలు సంతోష్ పంచుకున్నారు. త్వరలోనే తానూ తడోబా టైగర్ రిజర్వ్ లో పర్యటిస్తానని తెలిపారు. పర్యావరణ ప్రేమికుడిగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహిస్తూ తన కెమెరా కన్నుల ద్వారా బంధించిన పక్షులు, ప్రకృతి చిత్రాలను ప్రతివారం చేయటం ఆనవాయితీగా సంతోష్ కుమార్ కొనసాగిస్తున్నారు.

Tiger in Tadoba Tiger Reserve

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News