ఫార్ములా ఈ రేస్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.. ఇప్పటికే ఎసిబి కేసు నమోదు చేసి విచారణ మొద లుపెట్టగా, ఇడి కూడా రంగం లోకి దిగినట్టు తాజా పరిణామాలతో తెలుస్తుంది. ఈ మేరకు తాజాగా తెలంగాణ ఎసిబి డిజి విజయ్‌కుమార్ కు హైదరాబాద్ ఇడి జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ లేఖ రాశారు. మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై నమోదైన కేసు వివ రాలను తమకు అందజేయా లని ఆ లేఖలో హైదరాబాద్ ఇడి జాయింట్ డైరెక్టర్ పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్ కాపీతో పాటుగా హెచ్‌ఎండిఎ సంస్థ అకౌంట్ నుంచి ఎంత మొత్తం నిధులను బదిలీ చేశారు అని పూర్తి వివరాలు కూడా కావాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ నగదు బదిలీకి సంబంధించి ఏ ఏ తేదీలలో ట్రాన్సాక్షన్స్ జరిగాయో వివరాలతో సహా పంపాలని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇక ఇదే సమయంలో మున్సి పల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ ఫిర్యాదు కాపీని కూడా తమకు పంపాలని ఇడి జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ ఎసిబి డిజికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఈ కేసులో మనీల్యాండరింగ్ కోణంలోనే దర్యాప్తుచేయాలని ఇడి నిర్ణయించుకుని ఉంటుందని అనుకుంటున్నారు. ఎందు కంటే, ప్రత్యేకించి ఫార్ములా కార్ రేసు అవినీతిని ఇడితో విచారణ చేయించాలని ఎవరూ డిమాండ్ చేయలేదు. ఇడి విచారణ కోరుతు ఎవరూ కోర్టులో కేసు కూడా వేయలేదు. అలాంటిది తనంతట తానుగానే కేసులో ఇడి ఎంటరైందంటే అర్ధమేంటి ? మనీల్యాండరింగ్ కోణం తప్ప మరోటి కనబడటంలేదు. మనీల్యాండ రింగ్ జరిగినట్లు ఆరోపణలు వినబడుతున్న ఏ కేసులో అయినా సూమోటోగా కేసు నమోదు చేసుకుని ఇడి ఎంటర వ్వచ్చు. ఎలాగూ అనుమతు లు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా రు. 55 కోట్లను బదిలీ చేసినట్లు అర్వింద్ కుమార్ ఇప్పటికే చీఫ్ సెక్రటరీకి రాత పూర్వకంగా చెప్పిన విషయం విదితమే. అర్వింద్ ఇచ్చిన రాతపూర్వక వాగ్మూలం ఆధారంగానే ఎసిబి విచారణలో ముందుకు వెళుతోంది. ఇదే విషయమై ఇడి కూడా దృష్టిపెట్టినట్లు అర్ధమవుతోంది. ఏదేమైనా అందుబాటులోని వివరాలు, సాక్ష్యాల ఆధారంగా ఫార్ములా కార్ రేసు కేసులో ఇడి కూడా కేసులు నమోదు చేస్తే కెటిఆర్, అర్వింద్‌కు చిక్కులు తప్పేట్లులేదనే అనిపిస్తోంది.
కాగా, ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై ఎసిబి అధికారులు గురువారం నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఇందులో ఎ1గా కెటిఆర్ ఎ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఎ3గా హెచ్‌ఎండిఎ చీఫ్ ఇంజినీర్ బిఎల్‌ఎన్ రెడ్డి పై తెలంగాణ ఎసిబి కేసు నమోదు చేసింది. మాజీ మంత్రి కెటిఆర్‌పై విచా రణకు ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సిఎస్ శాంతి కుమారి ఎసిబికి లేఖ రాశారు.