Saturday, November 23, 2024

అమెరికాలోని ఐటి సర్వ్ అలయన్స్ ప్రతినిధులతో

- Advertisement -
- Advertisement -

టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ శాఖల కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల భేటీ
ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటి రంగం విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు
మంత్రి కెటిఆర్ ఆదేశాలతో నిజామాబాద్‌లో ఐటి రంగం అభివృద్ధికి చర్యలు

Bigala Mahesh meet with IT representatives

మనతెలంగాణ/హైదరాబాద్:  ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు అమెరికాలోని ఐటి సర్వ్ అలయన్స్ ప్రతినిధులతో టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ శాఖల కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల సమావేశమయ్యారు. త్వరలో నిజామాబాద్ జిల్లాలో పూర్తి కానున్న ఐటి హబ్‌తో అక్కడి మౌలిక వసతులను పరిశీలించాలని ఆయా సంస్థల ప్రతినిధులకు మహేశ్ బిగాల విజ్ఞప్తి చేశారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటి రంగాన్ని విస్తరించడానికి మంత్రి కెటిఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు తదితర విషయాలను ఆయా సంస్థల ప్రతినిధులతో మహేశ్ బిగాల చర్చించారు.

నిజామాబాద్‌లోని ఐటి హబ్ 5 ప్లోర్‌లతో 55 వేల ఎస్‌ఎఫ్‌టిల మేర నిర్మాణం జరుగుతుందని ఆయన వారితో పేర్కొన్నారు. ఈ ఐటి హబ్ అభివృద్ధికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గణేశ్ బిగాల ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా అక్కడ చర్యలు చేపట్టారని మహేశ్ బిగాల తెలిపారు. ఐటి హబ్‌కు కావాల్సిన సదుపాయాలను కల్పిస్తామని ఎమ్మెల్యే గణేశ్ బిగాల హామినిచ్చారని, మహేశ్ బిగాల ఆయా కంపెనీల ప్రతినిధులతో తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ఐటి హబ్ నిర్మాణంతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఐటిరంగంలో మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News