Sunday, December 22, 2024

ఆ స్టార్ హీరోతో చిందేయనున్న బిగ్‌బాస్ బ్యూటీ రతిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిగ్‌బాస్‌లో రతికా రోజ్ కంటెస్టెంట్‌గా ప్రవేశించి నెగిటివిటీతో మంచి పేరు తెచ్చుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లో అటు పల్లవి ప్రశాంత్, ఇటు యావర్‌తో లవ్ ట్రాక్ నడిపి కొన్ని రోజుల పాటు హౌస్‌లోనే ఉండిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అందాలను ఒలకబోస్తూ ఫొటోలను షేర్ చేస్తూ సందడి చేస్తుంది. ఆమె సినిమాలో నటించాలనే కోరిక ఎక్కువగా ఉండేది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ పార్టీ పెట్టాడు. అటు రాజకీయంలో బిజీగా ఉంటూనే ఇటు సినిమాలు చేస్తున్నాడు. విజయ్‌కు సంబంధించిన ఓ సినిమాలో రతికా రోజ్‌కు అవకాశం వచ్చినట్టు సమాచారం. ఈ న్యూస్ వైరల్ కావడంతో ఆమె అభిమానులు అల్ ది బెస్ట్ చెబుతున్నారు. విజయ్‌తో నటించాలంటే అంతా సులభం కాదని, మంచి పాత్రలు రావాలంటే ఎంతో అదృష్టం ఉండాలని ఆమె అభిమానులు వాపోతున్నారు. అధికారికంగా ఇప్పటివరకు స్పందించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News