Monday, December 23, 2024

బిగ్‌బాస్ కంటెస్టెంట్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

చెన్నై: పెళ్లి పేరుతో చిత్రహింసలు పెట్టడంతో పాటు తన వద్ద తీసుకున్న నగదు ఇవ్వడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఓ యువతి ఫిర్యాదు చేయడంతో బిగ్‌బాస్ కంటెస్టెంట్ ను అరెస్టు చేసిన సంఘటన తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ మహిళ జిమ్ ట్రైనర్‌గా పని చేస్తుంది. మలయాళ నటుడు షియాస్ కరీమ్ ఆమెతో పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె వద్ద నుంచి రూ.11 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. 2021 నుంచి ఆమెను చిత్ర హింసలకు గురి చేశాడు. అతడి వేధింపులు మితిమీరడంతో కాసర్‌గోడ్‌లోని చందేరా పోలీస్ స్టేషన్‌లో షియాష్ కరీమ్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. బిగ్‌బాస్ షోతో కరీమ్ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. జిమ్ ట్రైనర్ పై అతడు అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News