Monday, December 23, 2024

బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌ అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బిగ్‌బాస్ కన్నడ షోలో నిర్వహిస్తుండగా ఓ కంటెస్టెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వర్తుర్ సంతోష్ అనే ప్రముఖ నటుడు బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా ఉన్నాడు. వర్తుర్ సంతోష్ బిగ్‌బాస్ హౌస్‌లో పులి గోరు ధరించడంతో అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. సంతోష్‌ను అరెస్టు చేస్తామని పారెస్ట్ అధికారులు బిగ్‌బాస్ నిర్వహకులకు చెప్పారు. బిగ్‌బాస్ నిర్వహకులు ఒప్పుకోకపోవడంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు హెచ్చరించారు. హౌస్‌లో ఉండగానే సంతోష్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సంతోష్ నుంచి వివరాలు తెలుసుకున్న తరువాత వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అతడిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. అతడిని కోర్టులో హాజరు పరుస్తామని ఫారెస్ట్ అధికారి రవీంద్ర వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News