Monday, December 23, 2024

బిగ్‌బాస్‌ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌

- Advertisement -
- Advertisement -

బిగ్‌బాస్‌ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గజ్వేల్‌ మండలం కొల్గూరూలో బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్ తోపాటు అతని సోదరుడు మనోహర్ ను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియో వద్ద వాహనాల ద్వంసం, దాడి ఘటనలో పోలీసులు.. ఎ-1గా బిగ్‌బాస్‌-7 విజేత పల్లవి ప్రశాంత్ ను చేర్చగా, ఎ-2గా అతని సోదరుడు మనోహర్, ఎ-3గా అతని స్నేహితుడు వినయ్ ను చేర్చారు. ఎ-4గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన సాయికిరణ్, అంకిరావుపల్లి రాజు అనే ఇద్దరు యువకులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

బిగ్‌బాస్‌లో పాల్గొన్న ఇద్దరి కంటెస్టెంట్ల అభిమానుల మధ్య గొడవ జరగడంతో కార్లు, ఆర్‌టిసి బస్సులపై దాడి చేశారు. ఈ దాడిలో కార్లు, ఆరు ఆర్టిసీ బస్సులు ధ్వంసం అయ్యాయి. ఆర్‌టిసి అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అతడి అభిమానులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News