Wednesday, January 22, 2025

బిగ్‌బాస్ విన్నర్ ప్రశాంత్… అభిమానుల మధ్య గొడవ… ఆర్‌టిసి బస్సు ధ్వంసం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిగ్‌బాస్ సీజన్-7 టైటిల్‌ను యూ ట్యూబర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నారు. అమర్ దీప్ రన్నర్‌గా నిలిచాడు. అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రశాంత్, అమర్ దీప్ మధ్య తోపులాట జరిగింది. చిన్న గొడవ పెద్దదిగా మారడంతో ఇరువైపుల అభిమానులు దాడులు చేసుకున్నారు. కొండాపూర్-సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఆర్‌టిసి బస్సుపై రాళ్లతో దాడి చేశారు. హౌస్ నుంచి అమర్ తన కుటుంబ సభ్యులతో బయటకు వచ్చి కారులో వెళ్తుండగా అతడిపై వాహనంపై దాడి చేశారు. అమర్ దీప్ వాహనాన్ని రాళ్లతో దాడి చేసి భయానకం సృష్టించారు. వెంటనే పోలీసులకు సమాచారం తెలియడంతో అక్కడికి చేరుకొని అభిమానులపై లాఠీఛార్జీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆటను ఆటగా చూడాలని కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News