Sunday, December 22, 2024

సైబర్ నేరాలే పెద్దవి: సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అధికారుల్లో నైపుణ్యంతో పాటు ఆత్మస్థైరాన్ని నింపడం తమ బాధ్యత అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పోలీసులకు కావాల్సిన అన్ని వసతులను కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నార్కోటిక్ బ్యూరో ఫోటో ఎగ్జిబిషన్‌ను సిఎం రేవంత్‌రెడ్డి తిలకించారు. వాల్‌బోర్డుపై మార్పు మన ప్రభుత్వ బాధ్యత అని సిఎం రాశారు.  యాంటి నార్కోటిక్ బ్యూరో కోసం 27 కార్లు, 40 ద్విచక్ర వాహనాలు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోసం 14 కార్లు, 30 ద్విచక్రవాహనాలను రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. చదువుకున్నవారు కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని, సైబర్ నేరగాళ్ల ఫిర్యాదుకు 1930 టోల్ ఫ్రీనంబర్ ఏర్పాటు చేశామని, నేరగాళ్ల నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు రూ.31 కోట్లు రాబట్టారని, కొత్త నేర న్యాయ చట్టాలపై కూడా పోలీసులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని, హత్య, అత్యాచారం కన్నా ఈ కాలంలో సైబర్ నేరాలే పెద్దవిగా మారాయన్నారు.

మధ్యతరగతి, పేదలే సైబర్ నేరాలకు గురవుతున్నారని, విద్యార్థులు ఎక్కువగా గంజాయికి బానిసలుగా మారుతున్నారని, సమర్థత ప్రదర్శించిన అధికారులకు పదోన్నతులు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిది అని, మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య డ్రగ్స్, సైబర్ నేరాలు అని, డ్రగ్స్ నేరగాళ్లు తెలంగాణ నేలపై అడుగు పెట్టాలంటే భయపడాలని రేవంత్‌రెడ్డి తెలిపారు. చిరంజీవి ముందుకొచ్చి డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన వీడియో ఇచ్చారని, డ్రగ్స్‌పై పోరాడుతున్న చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని రేవంత్ ప్రశంసించారు. సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందని, టికెట్లు ధరలు పెంచాలని సినీ పెద్దలు తమ దగ్గరకు వస్తున్నారన్నారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై సినీ పరిశ్రమ అవగాహన కల్పించడం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News