- Advertisement -
హైదరాబాద్: మరో భారీ మోసం హైదరాబాద్‌లో బయటపడింది. ఆన్‌లైన్ గేమింగ్, పెట్టుబడుల పేరుతో చీటింగ్ జరిగిందని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. రూ.2200 కోట్లకు పైగా మోసం జరిగినట్టు ఆర్‌ఒసి గుర్తించింది. 13 బోగస్ సంస్థలపై రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఫిర్యాదు చేసింది. నకిలీ కంపెనీల ఏర్పాటు వెనుక చైనా కేటుగాళ్లు ఉన్నారు. నకిలీ కంపెనీల ఏర్పాటులో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి అనుమతులు తీసుకొని కంపెనీలు ఏర్పాటు చేశారు. మాల్ 008, మాల్ 98, వైఎస్ 0123, రిబేట్ యాప్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. రూ.2200 కోట్ల నగదును హాంకాంగ్‌కు తరలించినట్టు గుర్తించారు.
- Advertisement -