Sunday, January 19, 2025

చరిత్రలోనే అతిపెద్ద నష్టం.. గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎలోన్ మస్క్ పేరు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : టెస్లా సిఇఒ, ట్విట్టర్ యజమాని అయిన ఎలోన్ మస్క్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఆయన అత్యధిక సంపదలోనే కాదు, అతిపెద్ద నష్టంలోనూ రికార్డు సృష్టించి గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. 2022 సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు అయిన మస్క్ అత్యధికంగా నష్టపోయారు. ఆయన కంపెనీ అయిన టెస్లా షేరు అత్యధికంగా నష్టాలను మూటగట్టుకుంది. 2021 నవంబర్ నుంచి మస్క్ దాదాపు 182 బిలియన్ డాలర్లు నష్టపోయారు. ఇది ఇంచుమించు 200 బిలియన్ డాలర్లకు దగ్గరలో ఉంది.

అయితే గతంలో 2000 సంవత్సరంలో జపాన్‌కు చెందిన టెక్ ఇన్వెస్టర్ మసయోషి సన్ నష్టపోయిన 58.6 బిలియన్ డాలర్లు అత్యధిక నష్టంగా రికార్డులో ఉండగా, ఇప్పుడు మస్క్ దీనిని అధిగమించారు. ఫోర్బ్ ప్రకారం, మస్క్ నికర విలువ 2021 సంవత్సరంలో 320 బిలియన్ డాలర్లకు పెరగ్గా, 2023 సంవత్సరం జనవరి నాటికి ఇది 138 బిలియన్ డాలర్లకు పడిపోయింది. టెస్లా స్టాక్ అధ్వాన్నమైన పనితీరు కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. దీర్ఘకాలికంగా కంపెనీ ఫండమెంట్స్ బాగున్నప్పటికీ స్వల్పకాలికంగా మార్కెట్ పరిస్థితుల వల్ల కంపెనీ తీవ్రంగా నష్టపోయిందని మస్క్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News