Thursday, January 23, 2025

9వ తరగతి బాలికను లైంగికంగా వేధించి… తుపాకీతో కాల్చారు

- Advertisement -
- Advertisement -

పాట్నా: తొమ్మిదో తరగతి బాలికను లైంగికంగా వేధించడంతో పాటు ఆమెను తుపాకీతో కాల్చిన సంఘటన బీహార్ రాష్ట్రం అర్రా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక తన ముగ్గురు స్నేహితులతో కలిసి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి ఆమెను లైంగికంగా వేధించారు. ఆమె తిరస్కరించడంతో తుపాకీ తీసుకొని బాలిక నడుమపై కాల్చారు. అనంతరం ముగ్గురు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. స్థానికుల సహాయంతో బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. బాలిక నడుము నుంచి బుల్లెట్‌ను వైద్యులు బయటకు తీసినప్పటికి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ముగ్గురు బాలికను లైంగికంగా వేధించినట్లు పోలీసులకు వారు తెలిపారు. పోలీసులు సిసి టివి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు.

Also Read: వివేక్ అగ్నిహోత్రి ఆగ్రహం!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News