Wednesday, April 2, 2025

బైక్‌ను ఆపమన్నందుకు ఢీకొట్టడంతో హోంగార్డు మృతి

- Advertisement -
- Advertisement -

 

పాట్నా: వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్ ఆపమన్నందుకు హోంగార్డును ఢీకొట్టడంతో చనిపోయిన సంఘటన బిహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. బ్రజేష్ ఉపాధ్యాయ్ జంఢా పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. హరి ప్రసాద్ చౌక్ దగ్గర విధులు నిర్వహిస్తున్నాడు. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కౌశాల్ కుమార్(26), పంకజ్ కుమార్(25) అనే వ్యక్తులు ముజఫర్‌నగర్ నుంచి హరి ప్రసాద్ చౌక్‌కు వస్తుండగా బ్రజేష్ వారిని ఆపడానికి ప్రయత్నించాడు.

ఇద్దరు యువకులు బైక్ వేగాన్ని పెంచారు. బ్రజేష్ ఎదురుగా ఉండడంతో ఢీకొట్టడంతో పైకి ఎగిరి 20 మీటర్ల దూరంలో పడడంతో హోంగార్డు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్రవాహనదారుడి అతివేగమే హోంగార్డు ప్రాణాలు తీసింది.

Also Read: కర్ణాటకలో మతతత్వ పూనకం!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News