Tuesday, April 1, 2025

రాహుల్ ఓ బిన్ లాడెన్: బీహార్ బిజెపి అధ్యక్షుడు

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి శనివారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌తో పోల్చారు. గడ్డం పెంచినంత మాత్రాన ఎవరూ దేశ ప్రధానమంత్రి కాలేరంటూ ఆయన ఎద్దేవా చేశారు.

అరారియాలో జరిగిన ఒక సభలో చౌదరి మాట్లాడుతూ లాడెన్‌లా గడ్డం పెంచి దేశంలో తిరగడం వల్ల రాహుల్ ప్రధాన మంత్రి కాలేరని, ఆయనను రాజకీయాలలో 50 ఏళ్ల పిల్లాడిగా తాము పరిగణిస్తామని వ్యాఖ్యానించారు. గడచిన తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడానికి ఆయన ప్రజలతో సమావేశమయ్యారు.

బీహార్‌లో బిజెపి అధికారిలోకి వస్తే పవశు వధ, లవ్ జిహాద్, అక్రమ చొరబాట్లు వంటి కార్యకలాపాలను నిలిపివేస్తుందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News