Wednesday, January 22, 2025

బిహార్‌లో ఇటుకల బట్టీ పేలి 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్‌లోని రామ్‌గర్హవాలోని నరిగిర్ ప్రాంతంలో ఓ ఇటుకల బట్టీ చిమ్నీ(పొగగొట్టం) పేలిపోవడంతో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగిందని మోతీహరి జిల్లా మెజిస్ట్రేట్ శనివారం తెలిపారు. “నరిగిరిలో ఇటుకల బట్టీ చిమ్నీ పేలిపొవడంతో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. ఎనిమిది మందిని రక్సౌల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. శిథిలాలను తొలగించారు. రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది” అని మోతీహరి జిల్లా మెజిస్ట్రేట్ శిర్సత్ కపిల్ అశోక్ తెలిపారు.

బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లా శుక్రవారం సాయంత్రం బట్టీలో ఈ పేలుడు సంభవించింది. రాత్రి కావడం వల్ల కాపాడే ప్రయత్నాలు ఆగిపోయాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపడడానికి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాన్ని(ఎస్‌డిఆర్‌ఎఫ్)ను వినియోగించారు. చనిపోయినవారి మృత దేహాలను పోస్ట్‌మార్టం కోసం రామ్ గార్హవాకు, సదర్ ఆసుపత్రికి పంపించామని జిల్లా మెజిస్ట్రేట్ పేర్కొన్నారు. ఘటనాస్థలికి లేబర్ డిపార్ట్‌మెంట్ బృందం కూడా చేరుకుంది. ఆ బృందానికి సూపరింటెండెంట్ సత్యప్రకాశ్ నేతృత్వం వహించారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఖేదాన్ని వ్యక్తం చేయడమే కాకుండా, ప్రధాని జాతీయ రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2 లక్షలు ఒక్కో మృతుడి కుటుంబానికి ప్రకటించారు. “మోతీహరి ఇటుకల బట్టీలో జరిగిన ప్రమాదానికి కొందరి ప్రాణాలు పోవడంతో బాధపడ్డాను. వారి కుటుంబాలకు నా సంతాపం. గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్-గ్రేషియాను ప్రధానమంత్రి జాతీయ రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వబోతున్నాను. గాయపడిన వారికి రూ. 50వేలు ఇస్తాను” అని ప్రధాని అన్నట్లు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారికి తగిన చికిత్స అందించాలని ఆదేశించినట్లు ఆయన ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News