Thursday, January 23, 2025

ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలిన వంతెన

- Advertisement -
- Advertisement -

బెగుసరాయ్ : బీహార్ లోని బెగుసరాయ్ లో గండక్ నదిపై నిర్మించిన 206 మీటర్ల పొడవైన వంతెన ఆదివారం నాడు కుప్పకూలింది. బ్రిడ్డ్ ముందు భాగం కూలి నదిలోపడటం, ప్రారంభోత్సవానికి ముందే కూలడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అహోక్ గండక్ ఘాట్ నుంచి ఆక్రిత టోల చౌకి, బిషన్‌పూర్ మధ్య ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని 2016 లో ప్రారంభించి 2017లో పూర్తి చేశారు. రూ.13 కోట్ల వ్యయంతో చీఫ్ మినిస్టర్ నబార్డ్ పథకం కింద ఈ నిర్మాణం జరిగింది. అయితే అనుసంధాన రోడ్డు లేకపోవడంతో బ్రిడ్జి ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. కాగా, కొద్ది రోజుల క్రితమే బ్రిడ్జి ముందు భాగంలో పగుళ్లను గుర్తించి, డిసెంబర్ 15న ఈ విషయంపై అధికారులకు లేఖ రాయడం జరిగింది. కానీ ఈలోపే బ్రిడ్జి ముందు భాగం కుప్పకూలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News