Monday, December 23, 2024

బీహార్ లో తేజస్వి యాదవ్ అన్నకు కూడా మంత్రి పదవి!

- Advertisement -
- Advertisement -

Bihar new cabinet ministers

పాట్నా: బీహార్ లో కొత్త మంత్రి వర్గం పగ్గాలు చేపట్టింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యాదవ్, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తమ మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో మంగళవారం 31 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో 16 మంది ఆర్జేడీకి చెందిన వారు ఉండగా.. నితీశ్ కు చెందిన జేడీయూ నుంచి 11 మంది ఉన్నారు. కాంగ్రెస్ చెందిన ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కింది.  హిందుస్తానీ ఆవామ్ మోర్చా ఒకరు, మరో స్వతంత్ర ఎమ్మెల్యేకు కూడా నూతన మంత్రి వర్గంలో చోటు లభించింది.  తేజస్వి యాదవ్ అన్న, లాలూ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

బీహార్ నూతన మంత్రి మండలిలో ఆర్జేడీ నుంచి ఎంపికైన కొత్త మంత్రులు:
1. తేజ్ ప్రతాప్ యాదవ్
2. అలోక్ కుమార్ మెహతా
3. అనితా దేవి
4. సురేంద్ర ప్రసాద్ యాదవ్
5. చంద్ర శేఖర్
6. లలిత్ యాదవ్
7. జితేంద్ర కుమార్ రాయ్
8. రామా నంద్ యాదవ్
9. సుధాకర్ సింగ్
10. కుమార్ సర్వజీత్
11. సురేంద్ర రామ్
12. షమీమ్ అహ్మద్
13. మహమ్మద్ షానవాజ్ ఆలం
14. మహ్మద్ ఇస్రాయిల్ మన్సూరి
15. కార్తీక్ సింగ్
16. సమీర్ కుమార్ మహాసేత్

జేడీయూ నుంచి కొత్త మంత్రులు:
1. విజయ్ కుమార్ చౌదరి
2. బిజేంద్ర ప్రసాద్ యాదవ్
3. అశోక్ చౌదరి
4. షీలా మండలం
5. శ్రావణ్ కుమా
6. సంజయ్ ఝా
7. లేషి సింగ్
8. మొహమ్మద్ జమా ఖాన్
9. జయంత్ రాజ్ కుష్వాహ
10. మదన్ సాహ్ని
11. సునీల్ కుమార్
కాంగ్రెస్ నుంచి
1. ఎండీ అఫాక్ ఆలం
2. మురారి ప్రసాద్ గౌతమ్

వీరితో పాటు ‘హిందుస్తానీ ఆవామ్ మోర్చా’ నుంచి సంతోష్ సుమన్ మాంఝీ, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News