- Advertisement -
పాట్నా : బీహార్‌లో నివసిస్తున్న కుటుంబాల్లో మూడింట ఒకవంతు పేదరికంలోనే మగ్గుతున్నారు. నెలవారీ ఆదాయం రూ.6,000 లేదా అంతకన్నా తక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇటీవల రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనులలో ఈ సంఖ్య గణనీయంగా ఉన్నప్పటికీ.. ఉన్నత కులాల్లోనూ పేదలు ఉన్నట్లు నివేదిక తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 2.97 కుటుంబాల్లో 94 లక్షలకు పైగా (34.13 శాతం) కుటుంబాలు పేదరికంలో ఉన్నట్లు వెల్లడించింది. అన్నింటికన్నా ఆందోళన కరమైన విషయం ఏమిటంటే .. సుమారు 50 లక్షలకు పైగా కుటుంబాలు జీవనోపాధి లేదా మంచి విద్యావకాశాల కోసం బీహార్ వెలుపల నివసిస్తున్నారని తెలిపింది.
- Advertisement -