Wednesday, January 22, 2025

బీహార్ కులగణన సర్వే… సుప్రీం విచారణ అక్టోబర్ 3 కి వాయిదా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బీహార్‌లో కులాలవారీ సర్వేకు అనుమతిస్తూ పాట్నాహైకోర్టు జారీ చేసిన ఉత్వర్వును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణను సుప్రీం కోర్టు అక్టోబర్ 3 కి వాయిదా వేసింది. ఈ కేసులో కక్షిదారుల్లో ఒకరి అభ్యర్థన మేరకు విచారణ వాయిదా వేస్తున్నట్టు జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, ఎస్‌విఎన్ భట్టి లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. పాట్నాహైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లతోపాటు ఎన్‌జివొ ఏక్ సోచ్ ఏక్ ప్రయాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను జాబితాలో చేర్చడమైంది. పాట్నాహైకోర్టు ఉత్తర్వుపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు ఆగస్టు 7న తిరస్కరించింది. సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను ఆగస్టు 14కి వాయిదా వేసింది. అయితే ఏక్ సోచ్, ఏక్ ప్రయాస్ పిటిషన్‌తోపాటు నలందా నివాసి అఖిలేశ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News