Monday, December 23, 2024

ఆ రాష్ట్రంలో సిఎం కన్నా మంత్రులే ధనవంతులు..

- Advertisement -
- Advertisement -

పాట్నా: ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తమ ఆస్తుల నికర విలువ రూ.75.53లక్షలుగా ప్రకటించారు. గతేడాది ప్రకటించిన ఆస్తుల విలువకంటే ఇది రూ.18వేలు అదనం. బిహార్ సిఎం నితీశ్‌తోపాటు కేబినెట్ మంత్రులు డిసెంబర్ 31నాటికి తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రకటించారు. నగదు రూ.28,135 ఉండగా వేర్వేరు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్ల విలువ రూ.51,856గా నితీశ్ కుమార్ శనివారం ప్రకటించిన తాజా వివరాల్లో వెల్లడించారు.

నితీశ్‌కుమార్ ప్రభుత్వం ప్రతి ఏడాది మంత్రివర్గంలో సభ్యుల ఆస్తులు, అప్పులు వివరాలను సంవత్సరం చివరితేదీన ప్రకటించడం తప్పనిసరి చేసింది. ఈనేపథ్యంలో డిసెంబర్ 31న సిఎంతోపాటు కేబినెట్ మంత్రులు అందరూ తమ ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. ఈక్రమంలో చాలామంది మంత్రులు సిఎం కంటే ధనవంతులు కావడం విశేషం.

న్యూఢిల్లీలోని ద్వారక వద్ద హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటిలో ఉన్న ఏకైన నివాస ఫ్లాట్‌తో కలిపి రూ.75.53లక్షలుగా సిఎం నితీశ్ పేర్కొన్నారు. ఆస్తులు వివరాలు వెల్లడించిన ఇతర మంత్రుల్లో ఆర్‌జెడి చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. డిప్యూటి సిఎం ప్రసాద్ యాదవ్, పర్యావరణశాఖ మంత్రి ప్రతాప్ కూడా తమ ఆస్తుల వివరాలు వెల్లడించారు.

బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తనవద్ద 2022నాటికి రూ.75వేలు నగదు, తన భార్య రాజశ్రీవద్ద రూ.1.25లక్షల నగదు ఉన్నట్లు తెలిపారు. తేజ్ ప్రతాప్ రూ.1.7లక్షల నగదుతోపాటు ఆస్తుల నికర విలువ రూ.3.2కోట్లుగా పేర్కొన్నారు. ఆస్తులు వివరాలు ప్రకటించినవారిలో ఆర్థికమంత్రి విజయ్‌కుమార్ చౌదరి, విద్యుత్‌శాఖ మంత్రి బిజేంద్రప్రసాద్, రెవెన్యూ, భూసంస్కరణలశాఖ మంత్రి మెహతా, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిశ్రావణ్‌కుమార్, గనుల శాఖ మంత్రి ప్రసాద్ యాదవ్, సమాచారశాఖమంత్రి సంజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News