Sunday, December 22, 2024

బీహార్ సిఎం ప్రసంగిస్తుండగా.. దూసుకొచ్చిన యువకుడు

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వాతంత్య్రవేడుకల్లో ప్రసంగిస్తుండగా, ఓ యువకుడు దూసుకొచ్చాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పాట్నా లోని గాంధీ మైదాన్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించిన తరువాత ప్రసంగిస్తుండగా ఓ యువకుడు చేతిలో పోస్టర్ పట్టుకుని వేదిక వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. తనకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని పోస్టర్‌లో రాసుకొచ్చాడు.

ఈ ఊహించని పరిణామానికి అక్కడ ఉన్నవారు ఉలిక్కి పడ్డారు. భద్రతా సిబ్బంది అడ్డుకుని వేదిక వద్ద నుంచి దూరంగా తీసుకెళ్లి విచారించారు. ఆ యువకుడిని ముంగేర్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల నితీశ్ కుమార్‌గా గుర్తించారు. అతడి తండ్రి రాజేశ్వర్ పాసవాస్ బిహార్ మిలిటరీ పోలీస్ విభాగంలో పనిచేస్తూ కొన్నేళ్ల క్రితం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఎంను కలిసేందుకు అక్కడకు వచ్చాడు అని పాట్నా జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ వెల్లడించారు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News