Wednesday, January 22, 2025

ఏం చేశాడని మోడీని మరో జాతిపితగా కొనియాడుతున్నారు..?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్రం కోసం ఆర్‌ఎస్‌ఎస్ చేసిందేమీ లేదు, ఇక ఇప్పుడు కొత్త జాతిపితగా కొందరితో కొనియాడబడుతోన్న వ్యక్తి దేశానికి చేసింది ఏమీ లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విమర్శించారు. ఇటీవల అమృత ఫడ్నవిస్ మోడీని ఉద్ధేశించి నవ భారతానికి కొత్త జాతిపిత ఖ్యాతి మోడీకి దక్కుతుందని వ్యాఖ్యానించడంపై నితీశ్ స్పందించారు. ఆయన ఈ దేశానికి ఏం చేశారు?. దేశ స్వాతంత్య్రానికి ఆర్‌ఎస్‌ఎస్ చేసింది సున్నానే అని అన్నారు. భారత్‌కు ఇద్దరు జాతిపితలు ఉన్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడ్నవిస్ భార్య అమృత పదేపదే చెపుతూ వస్తున్నారు.

మోడీని మరో జాతిపిత అని పేర్కొంటున్నారు. ఏ పోలికకు అయినా ఎంతో కొంత సమన్వయం అవసరం, ఇది వికటిస్తే ప్రమాదం అవుతుందని, దీనిని ఎవరైనా అర్థం చేసుకుంటే మంచిదని అమృత పేరు ప్రస్తావించకుండా నితీశ్ ఆదివారం స్పందించారు. రాజకీయ స్తోత్రం చివరికి మితిమీరింది. దేశానికి ఇద్దరు జాతిపితలను తీసుకువచ్చే స్థాయికి బిజెపి నేతలు దిగజారారని విమర్శించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News