- Advertisement -
పాట్నా: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం పాట్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్లిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అదుపుతప్పి కిందపడ్డారు.
రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆవిష్కరించిన ఒక శిలాఫలకం వద్దకు వెళుతుండగా నితీశ్ కుమార్ అదుపుతప్పి కిందపడ్డారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది ముఖ్యమంత్రికి చేయూతనిచ్చి నిలబెట్టారు. అయితే ఈ ఘటనలో నితీశ్ కాలికి ఎటువంటి గాయం కాలేదు. ఆయన మామూలుగా నడుచుకుంటూ వేదిక వద్దకు చేరుకుని మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
- Advertisement -