Sunday, December 22, 2024

ఆస్పత్రిలో లాలూకు నితీష్ పరామర్శ

- Advertisement -
- Advertisement -

Bihar CM Visits Lalu Prasad Yadav In Hospital

పాత మిత్రుడి ఆరోగ్యంపై ఆరా

పాట్నా: ఇక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్‌జెడి అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పరామర్శించారు. ఇంట్లో మెట్లపై నుంచి జారిపడడంతో భుజానికి ఫ్రాక్చర్ అయిన లాలూ గత సోమవారం ఇక్కడి పరాస్ ఆసుపత్రిలోని ఐసియులో చేరారు. బుధవారం ఆసుపత్రిని సందర్శించిన నితీష్ కుమార్ లాలూను కలుసుకుని ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కాగా..మెరుగైన చికిత్స కోసం లాలూను ఎయిర్ ఆంబులెన్స్‌లో ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా నితీష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ లాలూ ఆరోగ్యం స్వల్పంగా మెరుగుపడిందని, అయితే ఆయనను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తే మంచిదని అన్నారు. తన ఒకనాటి మిత్రుడు, ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థి అయిన లాలూతో తన అనుబంధం గురించి విలేకరులు ప్రశ్నించగా&తమది ఎన్నో ఏళ్ల స్నేహమని, యువకులుగా ఉన్నప్పటి నుంచి తామిద్దరం స్నేహితులమని నితీష్ చెప్పారు. నిబంధనల ప్రకారం వైద్య ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం లాలూకు అందుతుందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News