Saturday, November 16, 2024

రూ. 24 లక్షల జీతాన్ని తిరిగిచ్చేసిన బిహార్ ప్రొఫెసర్ !

- Advertisement -
- Advertisement -

 

పట్నా: కరోనా కాలంలో ఆన్‌లైన్ క్లాసులు జరిగినప్పటికీ తాను పాఠాలేమీ సరిగా చెప్పలేకపోయానని, విద్యార్థులు కూడా అరకొరగానే హాజరయ్యారని పేర్కొంటూ బిహార్‌కు చెందిన ఓ కాలేజీ ప్రొఫెసర్ తన 33 నెలల జీతం…అక్షరాల రూ. 24 లక్షలు వెనక్కి ఇచ్చేశాడు. మనస్సాక్షికి అనుకూలంగా నడుచుకున్న ఆ నిజాయితీ ప్రొఫెసర్ పేరు లలన్ కుమార్. ఆయన పనిచేసేది బిహార్ ముజఫర్‌పూర్‌లోని ఓ ప్రభుత్వ కళాశాలలో.

లలన్ కుమార్ మాట్లాడుతూ “ ఈ కాలేజిలో చేరినప్పటి నుంచి ఒక్క రోజు కూడా పూర్తిగా పాఠాలు బోధించలేకపోయాను. పాఠాలు చెప్పకుండా జీతం తీసుకోడానికి నా మనస్సాక్షి ఒప్పుకోలేదు. అందుకే జీతాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేశాను” అని పేర్కొన్నాడు. ఆయన తన 33 నెలల జీతం…రూ. 2382228ని చెక్కు రూపంలో తిరిగి ఇచ్చేశాడు. అతడి ఈ పనికి బిఆర్ అంబేడ్కర్ బిహార్ యూనివర్శిటీ(బిఆర్‌ఎబియూ) రిజిస్ట్రార్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News