Sunday, January 12, 2025

23న రాహుల్‌కు బీహార్ కాంగ్రెస్ స్వాగత సన్నాహాలు

- Advertisement -
- Advertisement -

పాట్నా : వచ్చేవారం 23న బీహార్‌కు రానున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీహార్ కాంగ్రెస్ చారిత్రక స్వాగతం ఇవ్వడానికి బీహార్ కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. భారత్ జోడో యాత్ర తరువాత బీహార్‌కు రాహుల్ రావడం ఇదే మొదటిసారి అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్ యాదవ్ ఆదివారం వెల్లడించారు. బీహార్ సిఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో జరగనున్న విపక్షాల సమావేశానికి హాజరయ్యే ముందు రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,

ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, తదితరులతో కలసి బీహార్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద కొంతసేపు ఆగుతారని ఆయన తెలిపారు. విమానాశ్రయం నుంచి నేరుగా బీహార్ కాంగ్రెస్ కార్యాలయం సదాకత్ ఆశ్రమానికి చేరుకుంటారని అక్కడ గంటసేపు విశ్రాంతి తీసుకుంటారని , ఈ సందర్భంగా దారి పొడుగునా బ్రహ్మాండమైన స్వాగతం లభిస్తుందని వివరించారు. కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలతో స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News