Sunday, February 23, 2025

ఉత్కంఠ రేపుతున్న బీహార్ పాలిటిక్స్

- Advertisement -
- Advertisement -

బీహార్ పాలిటిక్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనతో వెళతారని తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొంది. లాలూ యాదవ్ నేతృత్వంలోని ఆర్‌జెడితో కూడిన మహాఘటబంధన్ (మహాకూటమి) ప్రభుత్వం నుండి నితీష్ కుమార్ విడిపోయి బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో తిరిగి చేరడంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. జెడి(యు)-బిజెపి కూటమికి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయవచ్చని, బిజెపి నాయకుడు సుశీల్ కుమార్ మోడీ తిరిగి డిప్యూటీగా వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News