Sunday, December 22, 2024

తండ్రైన బీహార్ ఉప ముఖ్యమంత్రి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తండ్రయ్యాడు. ఆయన భార్య రాజశ్రీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సంతోషకరమైన ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘దేవుడు సంతోషించి, కూతురి రూపంలో బహుమతి పంపాడు’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు కుమార్తెను ఎత్తుకుని ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. తొలిసారి తల్లిదండ్రులైన తేజస్వీ దంపతులకు కుటుంబ సభ్యులు, ఆర్జేడీ నేతలతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఇతర నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News