Saturday, December 21, 2024

5 సార్లు కొవిడ్ టీకా తీసుకున్న వైద్యురాలిపై దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

Bihar Doctor Took 5 Covid-19 Vaccines

పాట్నా : బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వైద్యురాలు ఐదుసార్లు వ్యాక్సిన్ తీసుకున్నట్టు రికార్డుల పూర్వకంగా నిర్దారణ కావడంతో బీహార్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. పాట్నాకు చెందిన సివిల్ సర్జన్ డాక్టర్ విభా కుమారీ సింగ్ గత ఏడాది జనవరి 28 న మొదటి డోసు తీసుకున్నారు. మార్చి నాటికి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈనెల 13 న ప్రికాషన్ డోసు కూడా తీసుకున్నారు. కానీ గత ఏడాది ఈమె ఫిబ్రవరి 6 న, జూన్ 17 న కూడా టీకాలు తీసుకున్నట్టు ప్రభుత్వ రికార్డుల్లో నమోదైంది. ఈ విషయమై డాక్టర్ విభా కుమారి స్పందిస్తూ నిబంధనల ప్రకారం తాను మూడు సార్లు మాత్రమే టీకా తీసుకున్నానని, మిగతా రెండు వ్యాక్సిన్లు తన పాన్ కార్డు వివరాలను ఉపయోగించి తన పేరు మీద రెండు టీకాలు తీసుకుని ఉంటారని పేర్కొన్నారు. దీనిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారని పాట్నా జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ సోమవారం వెల్లడించారు. దోషులుగా ఎవరు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈనెల మొదట్లో ఉత్తర బీహార్ జిల్లా మాధేపుర కు చెందిన 84 ఏళ్ల వృద్ధుడు తాను కొవిడ్ టీకా 12 డోసులు తీసుకున్నానని వెల్లడించి సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News