Friday, December 20, 2024

నర్సుపై నలుగురితో కలిసి వైద్యుడు అత్యాచారం… అంబులెన్స్ లో మృతదేహం

- Advertisement -
- Advertisement -

పాట్నా: నర్సుపై ఓ వైద్యుడు తన సిబ్బందితో కలిసి సామూహిక అత్యాచారం చేసి అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో పడేసిన సంఘటన బీహార్ రాష్ట్రం చంపారన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మోతిహరి ప్రాంతంలో జానాకి సేవ సదన్ నర్సింగ్ హోమ్‌ను మంతోష్ కుమార్ నిర్వహిస్తున్నాడు. సదరు హోమ్‌లో జైప్రకాశ్ దాస్ అనే వైద్యుడు పని చేస్తున్నాడు. 30 ఏళ్ల యువతి తన భర్త చనిపోవడంతో నాలుగేళ్ల చిన్నారి తన అమ్మగారింట్లో ఉంటుంది. మంతోష్ కుమార్ యువతి తల్లిని కలిసి నర్సింగ్ హోమ్‌లో పని ఇప్పిస్తానని మీ కూతురును రమ్మని కబురు పంపాడు.

కొన్ని రోజుల పోయిన తరువాత నర్సింగ్ హోమ్‌లో వైద్యుడుతో పాటు మంతోష్ లైంగికంగా వేధించడంతో తాను నర్సింగ్ హోమ్‌కు వెళ్లనని తల్లికి కూతురు చెప్పింది. జై ప్రకాశ్, మంతోష్‌కుమార్ ఆమె ఇంటికి వెళ్లి తప్పయిందని క్షమించమని అడిగి కూతురు నర్సింగ్ హోమ్‌కు పంపాలని జీతం ఎక్కువ ఇస్తానని ఆశ చూపాడు. ఆగష్టు 8న సదరు మహిళ నర్సింగ్ హోమ్‌కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. వృద్ధురాలుకు వైద్యుడు ఫోన్ చేసి మీ కూతురు ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో ముజఫర్‌పూర్ పంపించామని ఆస్పత్రి పేరు చెప్పాడు.

సదరు ఆస్పత్రిలో వివరాలు అడిగి తెలుసుకోగా రాలేదని తెలిసింది. తల్లి తన బంధువులతో కలిసి వెతకగా అంబులెన్స్ కూతురు మృతదేహం కనిపించింది. వెంటనే ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జైప్రకాశ్, మంతోష్ పరారీలోఉండగా కంపౌండర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నాడు. వైద్యుడు జై ప్రకాశ్ దాస్ మరో ఐదుగురితో కలిసి ఆమెపై అత్యాచారం చేసినట్టు ఒప్పుకున్నాడు. పారిపోయిన నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: తిరుమలలో చిరుత సంచారం… చిన్న పిల్లల చేతికి ట్యాగ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News