Monday, December 23, 2024

బీహార్ విద్యావిభాగంలో జీన్స్, టీషర్టుల ఆటకట్టు

- Advertisement -
- Advertisement -

పాట్నా : విద్యా విభాగంలో పనిచేసే సిబ్బంది జీన్స్, టీషర్టులు ధరించరాదని బీహార్ ప్రభుత్వం ఆదేశాలు వెలువరించింది. ఇప్పుడు సాధారణంగా వాడే టీషర్టులు, జీన్స్ వస్త్రధారణలతో పనిచేసే చోట సరైన సంస్కృతికి విఘాతం ఏర్పడుతుందని తెలిపారు. ఇకపై విద్యారంగ సంస్థల సిబ్బంది ఈ దుస్తులను వాడరాదని సంబంధిత విభాగం సంచాలకులు బుధవారం ఓ అధికారిక ఉత్తర్వులలో వెల్లడించారు. పని సంస్కృతి అనేది కీలకం. సరదాగా పనిచేయడానికి వచ్చినట్లు ఉండే దుస్తులతో వాతావరణం దెబ్బతింటుందని , సరైన సాధారణ దుస్తులలోనే విధులకు హాజరు కావల్సి ఉంటుందని తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News