Friday, April 4, 2025

బలపరీక్ష నెగ్గిన నితీశ్ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

పాట్నా: బిహార్‌లోని అసెంబ్లీలో నితీశ్ ప్రభుత్వం బలపరీక్ష నెగ్గారు. నితీశ్ ప్రభుత్వానికి 129 మంది ఎంఎల్‌ఎలు మద్దతుగా ఉన్నారు. బిహార్ అసెంబ్లీ నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. జెడియూ-బిజేపీ కూటమీ నేతృత్వంలోని ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో బలపరీక్షను నెగ్గింది.

బీహార్ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 243.  ఎన్‌డిఎకు 129 మంది సభ్యులతో సుఖప్రదమైన ఆధిక్యం ఉంది. వారిలో 78 మంది బిజెపి సభ్యులు. జెడి(యు)కు 45 మంది, హిందుస్థానీ అవమ్ మోర్చా (హెచ్‌ఎఎం)కు నలుగురు సభ్యులు ఉన్నారు. మెజారిటీ లక్ష్యం 122 ఉంటే సరిపోతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News