Wednesday, January 22, 2025

బీహార్‌కు మరో ఎయిర్‌పోర్టు

- Advertisement -
- Advertisement -

బీహార్ రాజధాని పాట్నాలో రెండవ విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. భిహ్తాలోని భారతీయ వైమానిక దళ స్థావరాన్ని ఇక పౌర వైమానిక సముదాయంగా మార్చే ప్రతిపాదనకు కేంద్రం సమ్మతి తెలిపింది. ఈ నూతన విమానాశ్రయ నిర్మాణానికి రూ 1,413 కోట్ల నిర్మాణ వ్యయ ప్రతిపాదనలకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ భేటీ జరిగింది .

వివరాలను కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. కాగా బెంగాల్‌లోని బాగ్డోగ్రా ఎయిర్‌పోర్టుకు రూ 1549 కోట్లతో నూతన టర్మినల్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. పాట్నాలో ఇప్పుడున్న ఎయిర్‌పోర్టు ప్రయాణికుల రాకపోకలకు తగినట్లుగా లేనందున నూతన విమానాశ్రయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. పాట్నాలోని ఎయిర్‌పోర్టుకు 24 కిలో మీటర్ల దూరంలోనే బిహ్‌టా ఐఎఎఫ్ స్థావరం ఉంది. ఇక్కడనే పాట్నా కొత్త ఎయిర్‌పోర్టు వెలుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News