Tuesday, April 29, 2025

ఐపిఎల్ లో పొట్టు పొట్టు కొట్టిన వైభవ్‌.. రివార్డు ప్రకటించిన బిహార్ సిఎం

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2025లో కేవలం 35 బంతుల్లోనే శతకం బాది.. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృస్టించాడు. ఈ క్రమంలో రాజస్థాన్‌ యువ బ్యాటర్‌ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అతి పిన్న వయసులో సెంచరీ కొట్టిన తొలి ప్లేయర్ గా, అతి తక్కువ బంతుల్లో శతకం సాధించిన తొలి భారత క్రికెటర్ గా, ఓవరాల్ గా రెండో క్రికెటర్ గా పలు రికార్డులను నెలకొల్పాడు. ఈ క్రమంలో వైభవ్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక బీహార్ కు చెందిన వైభవ్ ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసిస్తూ.. రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది.

కాగా, నిన్న రాత్రి గుజరాత్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్ లో రాజస్థాన్ బంపర్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి గెలుపొందింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తించాడు. మొదట కేవలం 17 బంతుల్లోనే అర్దశతకం బాదిన సూర్య వంశీ.. తర్వాత 38 బంతుల్లోనే 7 ఫోర్లు, 11 సిక్సులతో 101 పరుగులు చేసి గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశాడు. మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(70) అర్ధ శతకంతో రాణించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News