Wednesday, January 22, 2025

శివుడికి జలాభిషేకం… ట్రక్కుకు కరెంట్ వైర్ తగిలి తొమ్మిది మంది భక్తులు మృతి

- Advertisement -
- Advertisement -

పాట్నా: దేవాలయానికి భక్తులు మినీ ట్రక్కులో వెళ్తుండగా విద్యుత్ వైర్లు తగలడంతో తొమ్మిది మంది మృతి చెందిన సంఘటన బిహార్‌లోని హాజీపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పహలాజ ఘాట్‌కు చెందిన కొత్త మంది భక్తులు (కన్వారీలు) సుల్తాన్‌పుర్‌లో హరిహరనాథ్ ఆలయంలోని శివుడికి జలాభిషేకం చేసేందుకు ట్రక్కులో వెళ్తున్నారు. ఇండస్ట్రీయల్ పోలీస్ పరిధిలోని చౌహర్మల్ శివారులోని నైపర్ గేట్ సమీంపలోకి రాగానే హైటెన్షన్ విద్యుత్ వైర్ మినీ ట్రక్కుకు తగలడంతో తొమ్మిది మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హాజీపూర్‌లోని సాదర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం హాజీపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు అమ్రేష్ కుమార్, అమోద్ కుమార్, అశి కుమార్, అశోక్ కుమార్, చందన్ కుమార్, కలు కుమార్, నవీన్ కుమార్, రాజా కుమార్, రవి కుమార్‌గా గుర్తించామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News