Friday, December 20, 2024

ప్రియురాలి ఇంటికి ప్రియుడు.. తప్పించుకోబోయి బావిలో పడి..

- Advertisement -
- Advertisement -

పాటా: ప్రియురాలి ఇంటికి ప్రియుడు వెళ్లాడు. ఆమె కుటుంబ సభ్యులు ప్రియుడ్ని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో అతడు బావిలో దూకిన సంఘటన బిహార్ రాష్ట్ర చాప్రా జిల్లా గఢ్క పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… మోతిరాజ్‌పూర్ ప్రాంతంలో మున్నా రాజ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. శనివారం రాత్రి రెండు గంటల సమయంలో తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ప్రియురాలి ఇంట్లోకి ప్రియుడు వెళ్లగానే శబ్ధం రావడంతో ఆమె కుటుంబ సభ్యులు అలర్ట్ అయ్యారు. వెంటనే అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో తప్పించుకొని వెళ్లి అతడు బావిలో దూకాడు. గ్రామస్థులు అందరూ బావి దగ్గరకు చేరుకొని అతడిని అందులో నుంచి బయటకు తీశారు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టగా ప్రియురాలితో ప్రియుడికి పెళ్లి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News