Wednesday, April 9, 2025

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు.బిహార్‌కు చెందిన సతీష్ అనే వ్యక్తి పోలీస్ కస్టడీలో చనిపోవడం కలకలం రేపుతోంది. నగరంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న సతీష్‌ను ఘర్షణ విషయంలో పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చారు.

పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన తర్వాత సతీష్ కుప్పకూలినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News