Monday, December 23, 2024

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసిన బీహార్ మంత్రి జమాఖాన్

- Advertisement -
- Advertisement -

Bihar Minister Jamakhan met Minister Koppula Eshwar

హైదరాబాద్ : బీహార్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జమా ఖాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్య సభసభకు ఎన్నికైన సాలిన్ అన్సారీ, తెలంగాణకు చెందిన ముస్లిం ప్రముఖులు లు శుక్రవారం మైనారిటి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనను కలిసిన అతిథులను మంత్రి కొప్పుల ఈశ్వర్ శాలువాతో సత్కరించారు. తమ రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా ఈ సందర్భంగా బీహార్ మంత్రి కొప్పులను ఆహ్వానించారు. శనివారం మైనారిటిల సంక్షేమం, సముద్ధరణ, ఉన్నతికి ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల గురించి వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. బంజారాహిల్స్ లోని మైనారిటి గురుకుల విద్యా సంస్థల సొసైటి కార్యాలయంలో శనివారం ఉదయం అల్పాహారం తర్వాత మంత్రి ఈశ్వర్ సమక్షంలో అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News