Sunday, December 22, 2024

పక్కింటి అబ్బాయితో వివాహేతర సంబంధం… చెల్లి గొంతు కోసిన అన్న

- Advertisement -
- Advertisement -

పాట్నా: పక్కింటి అబ్బాయితో చెల్లి వివాహేతర సంబంధం పెట్టుకుందని అన్న ఆమెను కిడ్నాప్ చేసి చంపేసిన సంఘటన బీహార్ రాష్ట్రం నవడా జిల్లాలోని రూపౌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వివాహిత మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో సోదరుడు ఆమెపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమె మాత్రం వివాహేతర కొనసాగిస్తుండడంతో ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు కోసి హత్య చేశాడు. వివాహిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణలో భాగంగా ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని పోలీస్ అధికారి మహేష్ చౌధరి తెలిపాడు.

Also Read: రక్తం జుర్రుతానని మెడపై కొరకడంతో… స్నేహితుడి హత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News