Monday, January 20, 2025

స్నేహితుడిని కాల్చి చంపి…. బెడ్ షీట్ లో మూటకట్టి….

- Advertisement -
- Advertisement -

పాట్నా: స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తుండగా మిత్రుడు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందిన సంఘటన బిహార్‌లోని పాట్నాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పాట్నా శివారులో బర్హ టౌన్‌లో ఓ గిడ్డంగిలో రోహిత్ పాండే తన స్నేహితులతో కలిసి మద్యం పార్టీ చేసుకున్నాడు. మద్యం సేవిస్తుండగా స్నేహితుల మధ్య గొడవ రావడంతో రోహిత్‌ను ఓ మిత్రుడు తుపాకీతో తలపై కాల్చాడు. దీంతో రోహిత్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి అక్కడే వీధిలో పడేసి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. గిడ్డంగి నుంచి పాలీథిన్ బ్యాగ్, లిక్కర్, కూల్ డ్రింక్ బాటిల్, ప్లాస్టిక్ గ్లాసెస్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: రూ.5 కోసం హత్య… నలుగురు అరెస్టు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News