Sunday, December 22, 2024

అత్యంత కిరాతకంగా ఆలయ పూజారి హత్య

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లా దనపూర్ గ్రామంలో ఆలయ పూజారిని అత్యంత కిరాతకంగా దుండగులు కాల్చి చంపారు. కళ్లు పెరికి, మర్మావయవాలు కోసి, మృతదేహాన్ని పొదల్లోకి పారేశారు. ఈ సంఘటన శనివారం వెలుగు లోకి వచ్చింది. స్థానికులు ఆగ్రహావేశాలతో పోలీస్‌లపై రాళ్లు రువ్వడంతో ఇద్దరు పోలీస్‌లు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గోపాల్ గంజ్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

దన్‌పూర్ జిల్లా లోని శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న మనోజ్ కుమార్ గత ఆరు రోజులుగా కనిపించడం లేదని ఫిర్యాదు అందడంతో పోలీస్‌లు గాలింపు చేపట్టినా ఫలితం లేక పోయింది. శనివారం ఉదయం పొదల్లో పూజారి మృతదేహం కనిపించడంతో స్థానికులు ఆగ్రహావేశాలకు గురయ్యారు. పోలీస్‌లపై రాళ్లు రువ్వారు. జాతీయ రహదారిపై ఉన్న పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీస్‌లు గాలి లోకి కాల్పులు జరిపారు. గోపాల్ గంజ్ సదర్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ప్రాంజల్ అక్కడకు చేరుకుని ఆందోళనకారులను శాంతింప జేశారు. ఈ హత్యపై విచారణ జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News