Friday, December 20, 2024

ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి విడిపోయిన ఇంజిన్,రెండు బోగీలు

- Advertisement -
- Advertisement -

బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ నుంచి సోమవారం ఇంజిన్, రెండు బోగీలు వేరుపడడం పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. ఖుదీరామ్ బోస్ , కర్పూరి గ్రామ్ రైల్వే స్టేషన్ మధ్య సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. ఈ సంఘటన జరిగిన సమయంలో రైలు చాలా మెల్లగా వెళుతోంది. గంట తరువాత విడిపోయిన బోగీలను అనుసంధానించడంతో మళ్లీ రైలు కదిలిందని ఈస్ట్‌సెంట్రల్ రైల్వే సిపిఆర్‌వొ సరస్వతి చంద్ర తెలియజేశారు. ఈ సంఘటన ఎలా జరిగిందో నిపుణుల బృందం పరిశీలిస్తుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News