Wednesday, January 22, 2025

బీహార్ లో  లేడి డాక్టర్ ఎంత పని చేసింది

- Advertisement -
- Advertisement -

సరాన్: బీహార్ లోని సరాన్ జిల్లాలో ఓ లేడీ డాక్టర్ రేండేళ్లుగా తనతో సబంధం కొనసాగించి పెళ్లి చేసుకోడానికి నిరాకరించిన వ్యక్తి లైంగికాంగాన్ని కోసి పారేసింది. ఆమెను ప్రశ్నించేందుకు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రక్తంతో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన ఆమె ప్రియుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాడు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది.

ఆమెను పోలీసులు ఇంటరాగేటె చేసినప్పుడు తమ ఇద్దరికి రెండేళ్లుగా సంబంధం ఉందని, కానీ అతడు వివాహం చేసుకోడానికి నిరాకరిస్తున్నాడని తెలిపింది. తమ మధ్య వాదోపవాదాలు జరిగాక అతడిపై దాడిచేసినట్లు అంగీకరించింది.ఇదంతా సరాన్ జిల్లాలోని మర్హౌరా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. గాయపడిన అతడిని పాట్నాలోని సృష్టి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నిందితురాలు పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనని లైంగికంగా ఆ వ్యక్తి వాడుకుంటున్నాడని ఆమె పోలీసుల ముందు వాపోయింది. జులై 1న  రిజిష్టర్ మ్యారెజ్ కు అంతా సిద్ధం చేసుకున్నాక అతడు కోర్టుకు రాలేదని ఆ లేడి డాక్టర్ పోలీసులకు వివరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News