Friday, December 20, 2024

14 ఏళ్ల కూతురును అమ్మేసి… ప్రియుడితో పారిపోయిన ప్రియురాలు

- Advertisement -
- Advertisement -

పాట్నా: 14 ఏళ్ల కూతురును అమ్మేసి కుమారుడిని హాస్టల్‌లో చేర్పించి అనంతరం సదరు మహిళ తన లవర్‌తో కలిసి పారిపోయిన సంఘటన బిహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి చెందిన ఓ వ్యక్తి తన ఉద్యోగం కోసం కుటుంబంతో కలిసి బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ ప్రాంతం గోబర్ సాహిలో ఉంటున్నారు. ఆమె భర్త 2021లో చనిపోవడంతో స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పిల్లలు లేకుంటే పెళ్లి చేసుకుంటానని ప్రియురాలుకు ప్రియుడు హామీ ఇచ్చాడు.

Also Read: పురిట్లోనే చనిపోయిన బిడ్డ 42 ఏళ్ల తర్వాత తల్లిని కలిస్తే…

దీంతో కూతురిని ఓ వ్యాపార వేత్తకు అమ్మేసి అనంతరం కుమారుడిని ఓ ప్రైవేటు స్కూల్‌కు సంబంధించిన హాస్టల్‌లో చేర్పించాడు. ఈ విషయం తెలియడంతో ఆమె మామ జార్ఖండ్‌లోని రాంచీలో ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముజఫర్‌పూర్‌లోని సదర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వ్యాపారవేత్త నుంచి బాలిక తీసుకోవడంతో పాటు బాలుడిని కూడా తాత దగ్గరికి పంపించారు. బాలిక అమ్మిన మద్యవర్తిని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు ప్రియుడు, ప్రియురాలు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివిధ స్థలాల్లో పోలీసులు గాలిస్తున్నారని పోలీస్ అధికారి అవిదేశ్ దిక్షిత్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News