Monday, December 23, 2024

బీజపూర్ బీజేపీ నేతను హతమార్చిన నక్సల్స్

- Advertisement -
- Advertisement -

బీజాపూర్ : ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాకు చెందిన ఉసూరు బీజేపీ మండల అధ్యక్షుడు నీలకంఠ కక్కెంను ఆదివారం నక్సల్స్ కిరాతకంగా హత్య చేశారు. కుటుంబ సభ్యులు చూస్తుండగానే వారి ముందే గొడ్డలి, కత్తులతో నరికి చంపారు. ఆ తర్వాత అడవుల్లోకి పారిపోయారు. నక్సలైట్ల స్మాల్ యాక్షన్ గ్రూప్ ఈ హత్యకు పాల్పడింది.

నీలకంఠ కక్కెం తన గ్రామమైన ఆవపల్లిలో కుటుంబ సమేతంగా బందువుల వివాహ వేడుక ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్లినట్టు సమాచారం. తిరిగి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆవపల్లికి వస్తున్న సమయంలో నక్సలైట్లు అటకాయించారు. నీలకంఠను కారు నుంచి బయటకు తీసుకు వచ్చి చంపివేశారు. నీలకంఠ దాదాపు 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటున్నారు. ఆవపల్లి పోలీస్ స్టేషన్‌కు 8 కిమీ దూరంలోనే ఇది జరిగింది. అయితే హత్యకు కారణాలు తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News